తెలంగాణాలో జరిగిన గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే “7ఓ క్లాక్ బ్లేడ్ తీసుకురండి..కోసుకుంటా” అని చెప్పిన బండ్ల గణేష్ మాటలు ఎప్పటికీ మర్చిపోలేము. అయితే తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో గణేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఇందులో కూడా 7ఓ క్లాక్ బ్లేడ్ సీన్ ఉండబోతుందని ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. చిత్ర యూనిట్ తాజాగా అప్డేట్ చేసిన ఒక పిక్ చూస్తే అదే పాత్ర చేయబోతున్నాడని అనిపిస్తుంది. సినిమాలో 40నిముషాలు పాటు ట్రైన్ లో కొన్ని హీరోని హీరోయిన్ ఫ్యామిలీ మెప్పించే సీన్స్ ఉండబోతున్నాయట. ఇందులో భాగంగానే బండ్ల గణేష్ కామెడీ చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.
