తెలంగాణ విద్యుత్ రంగం దేశానికే దిక్సూచిగా నిలుస్తోందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిఅన్నారు. గతంలో విద్యుత్‌రంగం సంక్షోభంలో ఉన్నందున వ్యవసాయం, పరిశ్రమల రంగాలు కుదేలయ్యే పరిస్థితులు ఉండేవన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంక్షోభం నుంచి 24/7 విద్యుత్‌ను ప్రజలకు అందించేందుకు కృషి జరుగుతోందన్నారు.
శుక్రవారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర పునరుద్దరణీయ ఇంధన వనరుల అభివృద్ది సంస్థ (టీఎస్ రెడ్‌కో) ఆధ్వర్యంలో జరిగిన ఇంధనపొదుపు పురస్కారాల కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే రైతులకు ఉచిత విద్యుత్ అందించే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అన్నారు విద్యుత్ అవసరం లేని చోట ఆదా చేయడమే కాకుండా ప్రజల్లో విద్యుత్ ఆదా పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు.