ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల కోసం మరో వ్యవస్తను సృష్టిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 17వ తేదీ నుంచి గ్రామ సచివాలయాల పక్కనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం ప్రారంభించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.జనవరి నాటికి 3,300 కేంద్రాలు, ఫిబ్రవరిలో మరో 5 వేల కేంద్రాలు, ఏప్రిల్ నాటికి మొత్తం 11,158 కేంద్రాల ఏర్పాటు పూర్తి చేయాలని సూచించారు. సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ రంగంలో వినియోగించే ఉత్పత్తులను రైతు భరోసా కేంద్రాల ద్వారా సరసమైన ధరలకు విక్రయించాలని ఆదేశించారు. రైతులకు సలహాలు, శిక్షణ ఇచ్చేలా ఈ కేంద్రాలను తీర్చిదిద్దాలని సూచించారు.
