ఏపీలో ప్రతీ జిల్లాకు,ప్రతీ గ్రామానికి సమాన అభివృద్ధి జరగాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనని ఆర్దిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి అన్నారు. ఆయన ఈరోజు తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బుగ్గన రాష్ట్రంలో అన్ని జిల్లాలకు సమగ్ర పాలన మరియు అభివృద్ధి చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని అన్నారు. దీనికి సంబంధించే సీఎం తన ఆలోచనను బయటపెట్టారని బుగ్గన చెప్పడం జరిగింది. ఆయన ఆలోచనలను ప్రతీఒక్కరు స్వాగతిస్తున్నారని అన్నారు. ఒక్క చంద్రబాబు మాత్రం అందరికి విరుద్దంగా ఉన్నారని, అలా ఎందుకు ఉన్నారో అందరికి తెలిసిందే కదా అని అన్నారు.
