విశాఖపట్నం వేదికగా బుధవారం భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే జరిగింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి విండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన భారత్ భారీ టార్గెట్ ఇచ్చింది. నిర్ణీత 50 ఓవర్స్ లో 387 భారీ పరుగులు చేసింది. రోహిత్ ఏకంగా 159 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ రాహుల్ సెంచరీ సాధించాడు. ఇక మిడిల్ లో వచ్చిన పంత్, ఇయ్యర్ అయితే వెస్టిండీస్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు. ఇక అనంతరం చేసింగ్ కి వచ్చిన విండీస్ ఓపెనర్స్ నమ్మదిగా ఆట ప్రారంభించారు. అలా భారత బౌలర్స్ దెబ్బకు 280 పరుగులకు ఆల్లౌట్ అయ్యింది. కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ వికెట్లు తీసాడు. ఇక అసలు విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో మునుపెన్నడూ క్రికెట్ చరిత్రలో జరగని వింత ఒకటి జరిగింది. అదేమిటంటే ఇరుజట్ల సారధులు ఆడిన మొదటి బంతికే గోల్డెన్ డక్ అయ్యారు. ఇప్పటివరకు క్రికెట్ చరిత్రలో ఇలా జరగలేదు.