తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈరోజు గురువారం బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. అనంతరం మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ”విద్యార్థులు ఇది పరీక్షల సమయం. ఈ సమయాన్ని వృధా చేయవద్దు.పరీక్షలు ముగిసే వరకు సెల్ ఫోన్లు, సోషల్ మీడియా కు దూరంగా ఉండండి. టీవీలు, సినిమాలు చూడోద్దు. పరీక్ష పుస్తకాలు చదవండి.పరీక్షలు చాలెజింగ్ గా తీసుకోండి. మంచి మార్కులతో పాసయి తల్లిదండ్రులకు మంచి పేరుతీసుకు రండి.ఈ ఏడాది ఇంటర్ లోవందకు వంద శాతం ఫలితాలుండాలి.
అసలు పాస్ అవడం కోసం దవడమేంటి. ఉన్నత స్థాయి కి ఎదగాలంటే మంచి మార్కులతో పాస్ అవ్వాలి. నిత్యం విజ్ఞానాన్ని పొందాలి.బెజ్జంకి కళాశాలో ఎకనమిక్స్, కామర్స్, సివిక్స్ సబ్జెక్టు లలో గత ఏడాది తక్కువ మార్కులు వచ్చాయని, ఈ సారి ఈసబ్జెక్టుల్లో విద్యార్థులు వందకు వంద శాతం పాస్ కావాలి. ఈ మేరకు మాట ఇవ్వాలని లెక్చరర్లు, విద్యార్థులు మాట ఇవ్వాలి. అందుకు ప్రతిగా మాట ఇచ్చిన విద్యార్థులు, లెక్చరర్లు.నిన్న 49 మంది విద్యార్థులు రాలేదు. ఇవాళ 29 మంది రాలేదు. విద్యార్థులున కాలేజీ మానవద్దు. లెక్చరర్ కు కొద్ది మంది విద్యార్థులను కేటాయించి వారు తప్పనిసరిగా కాలేజికిహ హజరయ్యేలా పర్యవేక్షించాలి.
తల్లిదండ్రులను కలిసి కళాశాల కు హజరయ్యేలా సమావేశాలు నిర్వహించాలి. కళాశాలకు రాని విద్యార్థుల జాబితా గ్రామ సర్పంచ్ ల సాయం తీసుకోని…విద్యార్థులు కళాశాలకు వచ్చేలా చూడాలి.విద్యాశాఖాదికారులు ప్రతీ రోజు నాలుగు కళాశాలలు తిరిగాలి.విద్యార్థులు చదువుతున్నారా లేదా..కళాశాలకు వస్తున్నారా లేదా అన్న విషయాలు పరిశీలించాలి.
తల్లిదండ్రులు విద్యార్థులను వ్యవసాయ పనులకు పంపోద్దు.ఇవాళ్టి నుండి మద్యాహ్న భోజనం ప్రారంభిస్తున్నాం. రేపటి నుండి సాయింత్రం స్నాక్స్ ఏర్పాటు చేస్తాం. సాయింత్రం ఇక్కడేవిద్యార్తులు రెండు గంటలసేపు చదవాలి.అదనపు తరగతి గదులు కావాలని కోరారు. అందుకునలభై లక్షల రూపాయలు అవసరం. మీరు వందకు వంద శాతం పాసయితే వెంటనే అదనపు గదులకు అవసరమైన నిధులు ఇస్తామని”అన్నారు.
Tags harish rao kcr minister slider Stay away telangana governament telanganacm telanganacmo them trs trs governament trswp