తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లాలో వార్షికోత్సవ వేడుకకు బెజ్జంకి మోడల్ స్కూల్ వేదికైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు హాజరై మోడల్ స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులతో కొద్దిసేపు ముఖముఖిగా ముచ్చటించారు. విద్యార్థుల లో విద్యపై ఉన్న జిజ్ఞాసను పరీక్షించేందుకు పలువురు విద్యార్థులను స్టేజీపైకి పిలిచి 12వ ఎక్కమ్ అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి సరైన విధంగా ఎక్కాలు చెప్పకపోవడంతో ఉపాధ్యాయ బృందం పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇంటర్ లో మొదటి సంవత్సరం 57 శాతం, ద్వితీయ సంవత్సరం 81 శాతం పాస్ అయ్యారని ఆంతర్యమేంటనీ ఆరా తీయగా ఇంగ్లీషు మీడియం కారణంగా 57 శాతం వచ్చిందని అధ్యాపక బృందం తెలిపింది.
కాగా పదవ తరగతి తల్లిదండ్రులు విద్యార్థులపై దృష్టి సారించి తర్వాత ఇంటర్మీడియట్ లో వదిలేస్తున్నారని దాంతో ఇంటర్ చదువుతున్న విద్యార్ధికి విద్యపై ఆసక్తి చూపుతున్నారో.. లేదో తెలియని పరిస్థితి ఏర్పడి ఇంటర్ విద్యార్థి భవిష్యత్తు ఆందోళన కరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలపై ప్రేమ చదువుకు ఆటంకం కావొద్దని., సెల్ ఫోన్ విద్యార్థులను చెడగోడుతున్నదని చెప్పుకొచ్చారు. తల్లిదండ్రులు ఇళ్లలో టీవీలు తగ్గించాలని.. పిల్లలు చదివేలా తల్లిదండ్రులు చూడాలని కోరారు. సామాజిక దృక్పథం వారీగా రేపటి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని తయారు చేయాలని సూచించారు. విద్యను కేవలం ఉద్యోగం కోసం కాకుండా సమాజ స్పృహ, చైతన్యం కలిగి ఉండాలని సూచించారు.
మోడల్ స్కూల్ నుంచి పిల్లలుపైకి ఎదగాలని ఆకాంక్షించారు. పదవ తరగతిలో 10/10 జీపీఏ 5 మంది సాధించాలని, వంద శాతం రిజల్ట్స్ సాధించాలని కోరారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో వంద శాతం రిజల్ట్స్ రావాలని కోరారు. పాస్ అవడం ముఖ్యం కాదని, విలువ, విద్య ముఖ్యమని విద్యార్థి దశ చాలా క్రియాశీలక పాత్ర ఉంటుందని., కానీ పిల్లలు ఫౌండేషన్ లెవల్ లోనే తగ్గుతుందని., ఉపాధ్యాయ, అధ్యాపక బృందం క్వాలిటీ విద్య ఉండేలా చొరవ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, జెడ్పి చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, సర్పంచ్ ద్యావన పల్లి మంజుల శ్రీకాంత్, ఇతర ప్రజాప్రతినిధులు, కళాశాల అధ్యాపక బృందం, తదితరులు పాల్గొన్నారు.