గత ఐదేళ్ళ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎలాంటి స్థితిలో ఉందో అందరికి తెలిసిన విషయమే. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రం అప్పుల్లో ఉందని ప్రజలని నమ్మించారు. కాని అసలు విషయం ఏమిటీ అనే విషయానికి వస్తే ప్రభుత్వంలో ఉన్న సొమ్మును రాష్ట్ర ప్రజలకు ఉపయోగించకుండా సొంత మనుషులకు, కుటుంబానికే పనులు చేసుకున్నారు. దాంతో ప్రజలు విసిగిపోయి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ విషయానికి వస్తే అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరపున పోరాడాడు. నేను విన్నాను నేను ఉన్నాను అని హామీ ఇచ్చాడు. గెలిచిన తరువాత 6నెలల పాలనలోనే ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని శభాష్ అనిపించుకున్నాడు. తాజాగా రాజధాని విషయంలో ఆయన ప్రకటనకు ప్రత్యర్ధులు సైతం జేజేలు కొడుతున్నారు.
*సీఎం జగన్ గారు తీసుకున్న అభివృద్ధి వికేంద్రీకరణ అనే నిర్ణయాన్ని మేము మా పార్టీ స్వాగతిస్తున్నాం అని, ఈ నిర్ణయం వల్ల మా రాయలసీమ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు.
*ఇక టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అయితే విశాఖపట్నంని పరిపాలనా రాజధానిగా మార్చే అవకాశం ఉందంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని, సహజ సిద్దమైన సముద్ర తీర నగరం విశాఖను పరిపాలనా రాజధాని చేయడం మంచి నిర్ణయం అన్నారు.
* సీఎం జగన్ తీసుకున్న అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులుగా విభజించాలి అనే నిర్ణయం వల్ల రాష్ట్రానికి నష్టమేమి లేదు. ఇక దీనివల్ల రాష్ట్ర అభివృద్ధి పెరుగుతుందని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు.
*ఇక బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ కూడా 3ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, 3 రాజధానులు రావొచ్చు అని సీఎం జగన్ అన్న మాటలని స్వాగతిస్తున్నాం అని అన్నారు.అంతేకాకుండా 3 రాజధానుల మీద చంద్రబాబు వ్యాఖ్యలు అర్ధరహితం అని అన్నారు.