తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నిన్న బుధవారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన సంగతి విదితమే. ఈ సమావేశంలో జీఎస్టీ బకాయిలు,రాష్ట్రానికి రావాల్సిన నిధులు,మిషన్ భగీరథ,మిషన్ కాకతీయకు కేటాయించాల్సిన నిధులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరిన సంగతి విదితమే.
ఈ రోజు గురువారం మంత్రి హారీష్ రావు బెజ్జంకి మండలంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నారు, ఈ క్రమంలో మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” నిన్న ఢిల్లీ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో ఆర్థిక మాంద్యం ,ఆర్థిక క్రమశిక్షణపైన చర్చ జరిగింది.
వడ్డీలేని రుణాలు దేశంలో కొన్ని జిల్లాలకే ఇస్తున్నారు.దేశంలో అన్ని జిల్లాలకు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరాను. దేశంలోని అన్ని స్వయం సహయక బృందాలకు ఇవ్వాలని కోరాను. వీరికిచ్చే మొత్తాన్ని మూడు లక్షల నుండి ఐదు లక్షలు ఇవ్వాలని విన్నవించాను”అని తెలిపారు.