ఇది నిజంగా నిరుద్యోగులకు శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో వారికి ఆశలు కల్పించి చివరికి గాలికి వదిలేసారు. కాని జగన్ వచ్చిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను నేర్వేరుస్తున్నారు. ఈ మేరకు నిరుద్యోగులకు ఇప్పటికే న్యాయం చేయడం జరిగింది. అంతే కాకుండా ప్రతీ ఏడాది జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పడం జరిగింది. ఈ మేరకు జనవరి మొదటి వారంలోనే క్యాలెండర్-2020 ను విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ బోర్డు కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు చెప్పారు. ఈ క్యాలెండర్ కు సంబంధించి పరీక్షల నిర్వాహణలో ఐఐఎమ్, ఏపీపీఎస్సీ మధ్య ఒప్పందం కుదిరే అవకాసం ఉందని తెలుస్తుంది.
