రాజధాని ఎక్కడ ఉండాలి అని కేంద్రం నియమించిన తమిళనాడు ఐఏఎస్ శివరామకృష్ణన్ కమిటీలో ఇండియాలో పేరు ప్రఖ్యాతులున్న భవన రంగ నిపుణులు ,ఆర్ధిక నిపుణులు ఉన్నారు. వారు ఇచ్చిన నివేదిక గనుక ఒకసారి చూసుకుంటే..!
1.ఏపీలో ఏకైక అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరైంది కాదు.
2.రాష్ట్రంలో రాజధానిని వికేంద్రీకరించాలి.
3.అధికార వ్యవస్థలను వికేంద్రీకరించడంతోపాటు ప్రభుత్వ వ్యవస్థలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి.
4.విజయవాడ– గుంటూరు, విశాఖపట్టణం కేంద్రంగా ఉత్తరాంధ్ర, శ్రీకాళహస్తి– నడికుడి, రాయలసీమ ప్రాంతాల మధ్య అధికార వ్యవస్థలను వికేంద్రీకరించాలి.
5.శాసనసభ, సచివాలయం ఎక్కడ ఉంటాయో అక్కడే హైకోర్టు ఉండాలని లేదు. హైకోర్టును ఒక ప్రాంతంలో ఏర్పాటు చేస్తే మరో ప్రాంతంలో హైకోర్టు బెంచ్‌ను నెలకొల్పాలి.
6.విజయవాడ – గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే మూడు పంటలు పండే సారవంతమైన భూములు నాశనమై ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి పెనుముప్పు ఏర్పడుతుంది.
7.ఉత్తరాంధ్ర, రాయలసీమలలో ప్రభుత్వ అధికార వ్యవస్థలను విస్తరించాలి. కానీ ఆ ప్రాంతాల్లో ఉన్న భూముల వివరాలు అడిగినప్పటికీ ఏపీ ప్రభుత్వం ఇవ్వకపోవడం దురదృష్టకరం.
8.విజయవాడ– గుంటూరు నగరాల మధ్య ప్రాంతాన్ని మెగా సిటీగా అభివృద్ధి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి (చంద్రబాబు) చెప్పారు. కానీ ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన, పర్యావరణ పరిరక్షణ కోణంలో ఆ రెండు నగరాల మధ్య మెగా సిటీని విస్తరించడం ఆచరణ సాధ్యం కాదు.
9.విజయవాడ – గుంటూరు మధ్య రాజధానిని పూర్తిగా కేంద్రీకరిస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయి. దాంతోపాటు దేశంలో వరి ఉత్పత్తికి ప్రధానంగా దోహదపడుతున్న సారవంతమైన పంట పోలాలు నాశనమవుతాయి. ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది.
10.సారవంతమైన పంట పొలాలకు వీలైనంత తక్కువ నష్టం జరిగేలా రాజధాని ఏర్పాటు చేయాలి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సారవంతమైన భూములను వ్యవసాయేతర అవసరాలకు మళ్లిస్తే తీవ్ర ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
11.విజయవాడ – గుంటూరు మధ్య భూగర్భ జల మట్టం చాలా పైన ఉంటుంది. అది భూకంప క్షేత్రం కూడా. ఆ ప్రాంతంలో నేల స్వభావం రీత్యా అక్కడ భారీ భవనాల నిర్మాణం సరైంది కాదు.
12.అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి స్పష్టమైన విధానాన్ని రూపొందించాలి.
కాని చంద్రబాబు ఇవేమి పట్టించుకోకుండా తన కులస్తులకే జై కొట్టాడు. ఇక ఆ విషయానికి వస్తే కమ్మ సంఘం నాయకులు ఆ ప్రాంతంలోనే పట్టాలని ఒత్తిడి తెచ్చినట్టు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.