ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకోసం నిరంతరం కష్టపడుతున్నారు అనడంలో సందేహమే లేదని చెప్పాలి. ఎందుకంటే తానూ అధికారంలోకి వచ్చినప్పటినుండి ఆయన ఇచ్చిన హామీలకు కట్టుబడి చాలా వరకు నెరవేర్చడం జరిగింది. ఇలా ప్రతీ విషయంలో ప్రజల మన్నలను అందుకుంటున్నాడు. తాజాగా నాడు నేడు కార్యక్రమంలోఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 2,566 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసే ఒప్పందం కోసం హెటెరో డ్రగ్స్, వసుధ ఫార్మా, అడిలీలా ఫౌండేషన్, లారస్ ల్యాబ్స్ మరియు రెయిన్ కార్బన్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.