గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమైనా ఉందా అంటే శూన్యమే అని చెప్పాలి. ప్రజలను నమ్మించి తప్పుడు హామీలు ఇచ్చి చివరికి గెలిచిన తరువాత చేతులెత్తేశారు. రైతులకు ఆశలు కల్పించి చివరికి ఆత్మహత్యలు చేసుకునే స్థితికి తీసుకొచ్చాడు. ఇదేం న్యాయం అని అడిగిన వారిని పోలీసులతో కొట్టించిన ఘనత చంద్రబాబుది. ఇక రాజధాని అమరావతి విషయానికి వస్తే ఏమీలేని అమరావతిలో రాజధాని నిర్మిస్తానని అసలు తుగ్లక్ ఢిల్లీని వదిలి దౌలతాబాద్ వెళ్లినట్టు చంద్రబాబు విజయవాడ, తిరుపతి, వైజాగ్, కర్నూల్ వంటి పట్టణాలు వదిలేసి అమరావతి దగ్గరికి వెళ్లారు.
తుగ్లక్ దౌలతాబాద్ ను రాజధానిగా ప్రకటించాడు. తన ప్రభుత్వ కార్యాలయాను మాత్రమే మార్చక, మొత్తం ప్రజానీకానికి దౌలతాబాదుకు మకాం మార్చాలని హుకుం జారీ చేశాడు. దౌలతాబాదులో ప్రజా సౌకర్యాలు కలుగజేయడంలో విఫలుడైనాడు. కనీస వసతులైన నీటి సరఫరా కూడా చేయలేకపోయాడు. ఇప్పుడు అదే స్థితిలో చంద్రబాబు ఉన్నాడు. అమరావతి రాజధానిగా ప్రకటించకముందే తన భినామీలు, కులస్తులు, పార్టీ నాయకులతో అక్కడ భూములను తెలివిగా తక్కువ ధరలకే రైతుల దగ్గరనుండి కబ్జా చేయించాడు. మొత్తానికి రాజధానిగా అమరావతిని ప్రకటించాడు. పేరుకే రాజధాని అని చెప్పుకోవడం తప్ప అక్కడ సరైన వసతులు కూడా లేవని చెప్పాలి. రైతులకు అన్యాయం జరిగింది. కాని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం చంద్రబాబులా ఆలోచించకుండా ఉన్న పట్టనాలనే బాగా అభివృద్ధి చెయ్యాలని ఆలోచిస్తున్నారు. విశాఖపట్నం, కర్నూల్, విజయవాడ వీటిని అభివృద్ధి పధంలో తీర్చిదిద్దాలనే ఆలోచనలో ఉన్నారు. ఇదంతా చూస్తుంటే నిజమైన తుగ్లక్ చంద్రబాబే అనడంలో సందేహమే లేదని చెప్పాలి.