సంక్రాంతి పండగ సందర్భంగా రైల్వే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విభాగం ప్రకటించింది. అందులో భాగంగా కాచిగూడ నుంచి కాకినాడ వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. 82709/80710 నెంబర్లతో ‘సువిధ’ ప్రత్యేక రైలు.. జనవరి 10 తేదిన 18.45గంటలకు( సాయంత్రం 6. 45) కాచిగూడ రైల్వే స్టేషన్‌లో బయలుదేరి మరుసటిరోజు (జనవరి 11) ఉదయం 5.45 గంటలకు కాకినాడ చేరుతుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. తిరిగి ఈ ప్రత్యేక రైలు 80710 నెంబర్‌తో 18వ తేది 18.10 గంటలకు ( సాయంత్రం 6. 10) కాకినాడ రైల్వే స్టేషన్‌లో బయలుదేరి మరుసటిరోజు (19వ తేది) ఉదయం 5.10 గంటలకు కాచిగూడ చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
కాచిగూడ ప్రత్యేక రైలు.. జనవరి 3, 17, 24, 31, ఫిబ్రవరి 1, 8, 15, 22, 29, మార్చి 6, 13, 20, 27వ తేదీల్లో కాచిగూడ రైల్వే స్టేషన్‌లో సాయంత్రం 18.45 గంటలకు బయలుదేరి.. ఆయా తేదీల్లో మరుసటిరోజు ఉదయం 5.45 గంటలకు కాకినాడ చేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు. తిరిగి ఈ రైలు జనవరి 4, 11, 25, ఫిబ్రవరి 1, 8, 15, 22, 29, మార్చి7, 14, 21, 28వ తేదీల్లో కాకినాడ రైల్వే స్టేషన్‌లో 18.45 ( సాయంత్రం 6. 45 )గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 5.10 గంటలకు కాచిగూడ చేరుతుంది. ఈ ప్రత్యేక రైలు.. మల్కాజ్‌గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడెం, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు.
జనవరి18 నుంచి జనసాధన రైలు
జనవరి 18, 19, 20వ తేదీల్లో జనసాధన ప్రత్యేక రైలు విజయవాడలో రాత్రి 21.10 గంటలకు (రాత్రి 9.10) బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.20 గంటలకు విజయనగరం చేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు. తిరిగి 19, 20, 21వ తేదీల్లో విజయనగరం రైల్వే స్టేషన్‌లో ఉదయం 7.45కి బయలుదేరి అదేరోజు సాయంత్రం 16.30గంటలకు విజయవాడ చేరుతుంది. ఈ రైలు నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, రాజమహేంద్రవరం, ద్వారపూడి, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నంరోడ్డు, అనకాపల్లి, దువ్వాడ, సింహాచలం నార్త్, కొత్తవలస స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు.