విశాఖపట్నం వేదికగా నేడు భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే జరుగుతుంది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి విండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన భారత్ భారీ టార్గెట్ ఇచ్చింది. నిర్ణీత 50 ఓవర్స్ లో 387 భారీ పరుగులు చేసింది. రోహిత్ ఏకంగా 159 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ రాహుల్ సెంచరీ సాధించాడు. అయితే ఇక అసలు విషయానికి ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ ఒక రికార్డు సృష్టించాడు. అదేమిటంటే ఎనిమిది సార్లు 150 ప్లస్ స్కోర్ సాధించిన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఏ ఆటగాడు కూడా సాధ్యం కాని ఫీట్ అని చెప్పాలి. ఇంక మరో రికార్డు ఏమిటంటే ఈ 2019 సంవత్సరానికి గాను భారత్ తరపున 10సెంచరీలు సాధించిన మొదటి ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు.
