విశాఖపట్నం వేదికగా నేడు భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే జరుగుతుంది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి విండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన భారత్ ఓపెనర్స్ విచ్చలవిడిగా రెచ్చిపోయి ఆడుతున్నారు. రాహుల్, రోహిత్ భాగస్వామ్యంలో ఇప్పటికే 150పరుగుల మార్క్ ని దాటారు. ఇదే ఫామ్ కొనసాగిస్తే వారిని ఆపడం కష్టమనే చెప్పాలి. వీరిద్దరూ సెంచరీకి చేరువలో ఉన్నారు. విండీస్ బౌలర్స్ ఎంత ప్రయత్నించినా వికెట్స్ తీయడం కష్టంగానే ఉంది. ప్రస్తుతం భారత్ స్కోర్ 28ఓవర్స్ కి గాను 161 పరుగులు చేసింది.
