నిధి అగర్వాల్… సవ్యసాచి చిత్రం లో నాగ చైతన్యతో జోడి కట్టిన ఈ ముద్దుగుమ్మ, ఆ తరువాత తమ్ముడు అఖిల్ తో మిస్టర్ మజ్ను చిత్రంలో నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు హిట్ టాక్ అందుకోలేకపోయాయి. అయినప్పటికీ నటన పరంగా ఈ భామకు మంచి పేరు వచ్చింది. ఇక ఆ తరువాత మొన్న పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం హిట్ టాక్ రావడంతో ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళిపోయింది. సినిమాలు పక్కన పెడితే ఈ భామకు ఇంస్టాగ్రామ్ ఫాలోయింగ్ చాలా ఎక్కువని చెప్పాలి. తన పిక్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ముందుకు వెళ్తుంది. తాజాగా తాను పోస్ట్ చేసిన పిక్ ఒకటి ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతుంది.
