సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత ఈ విజయశాంతి ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన విసువల్స్, వీడియోస్ అన్ని సూపర్ హిట్ అని చెప్పాలి. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే జూలై 5న ప్రారంభం అయిన ఈ సరిలేరు నీకెవ్వరు ప్రయాణం నేటితో అంటే డిసెంబర్ 18తో ముగిసింది. ఇక నుండి ఫుల్ ప్రమోషన్లు పనిలో పడుతుంది చిత్ర యూనిట్.
