మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 40ఏళ్ల రాజకీయ అనుభవం అని గొప్పలు చెప్పుకుంటారు. కాని ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే అక్కడ మాత్రం ఏం కనిపించదు. ముఖ్యమంత్రిగా ఇంత అనుభవం ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఏం కావాలో వాటిని ఎలా సమకుర్చాలో మాత్రం ఆయనకు తెలియదు. ఆయనకు తెలిసిందల్లా ఒక్కటే. తన కుటుంబం, కులం, తనవాళ్ళ వ్యాపారాలు. ఇవే ఆయనకు కావల్సినవి. వీటికోసం ఆయన 40ఏళ్ల రాజకీయ జీవితాన్ని వెచ్చించారు. ఇక గత ఐదేళ్ళ పాలన విషయానికి వస్తే తప్పుడు హామీలు ఇచ్చి, రైతులను మోసం చేసి చివరికి వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడేలా చేసాడు. అయినా ఆయనకు చలనం లేదనే చెప్పాలి. తనని నమ్మి ఓట్లు వేస్తే రాష్ట్రాన్నే పీకల్లోతు కష్టాలలోకి తీసుకెళ్ళాడు. చంద్రబాబును నమ్ముకొని బాగుపడింది ఎవరూ అనే విషయానికి వస్తే..ఈ విషయంపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసారు.”మద్య నిషేదాన్ని తప్పుపట్టేలా మాట్లాడతాడు. ధరలెలా పెంచుతారని గద్దిస్తాడు. లక్ష కోట్లతో రాజధానిని ఒకే చోట నిర్మించాల్సిన అవసరమేమిటని అంటే దానికీ అడ్డుపడతాడు. ఎంత సేపూ తనవాళ్ల వ్యాపారాలు ఏమైపోతాయో అన్న ఆందోళన తప్ప రాష్ట్రం ఏమైపోయినా పట్టదు చంద్రబాబుకి” అని మండిపడ్డారు.