ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని ఏపీ టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. రాజదానితో సహా జగన్ ప్రబుత్వం అన్ని విషయాలలో ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలు చేస్తుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అసూయ,అక్కసులతో బురద చల్లే యత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని ప్రతిపాదన స్వాగతించదగినదని ఆయన అన్నారు. అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ పై ప్రభుత్వం ఆదారాలతో సహా బయటపెట్టిందని శ్రీనివాస్ అన్నారు.జగన్ ది చారిత్రాత్మక నిర్ణయం అని ఆయన అన్నారు. జగన్ ఏ సామాజిక వర్గానికీ అనుకూలం కాదు, వ్యతిరేకమూ కాదని మంత్రి స్పష్టం చేశారు. రాజధాని రాకముందే విశాఖ ప్రాంతంలో తమకు భూములున్నాయని అవంతి గుర్తుచేశారు
