ఆంధ్రప్రదేశ్ లో అధికారపార్టీ అధినేత వైఎస్ జగన్ రాజ్యసభ ఎన్నికల నిమిత్తం ముందుగానే ప్లాన్ వేస్తున్నారు. రెండు నెలలు ముందుగానే ఎవరిని పంపాలి అనేదానిపై జగన్ క్లారిటీ తీసుకున్నట్లు కొన్ని వర్గాలు గుసగుసలాడుత్నాయి. అయితే రెండేళ్లకొకసారి రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఏపీ నుండి నలుగురు వెళ్ళాల్సి ఉంది. ఇక జరిగిన ఎన్నికల ఫలితాలు పరంగా చూసుకుంటే ఆ నాలుగు స్థానాలు వైసీపీకే దక్కే ఛాన్స్ ఉంది. జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఏకంగా 151 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. మరోపక్క టీడీపీ తరపున గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గెలిచినా రాజీనామా చేసేసాడు. ఆయన వైసీపీ లోకి చేరకపోయినా వారికే సపోర్ట్ కాబట్టే వైసీపీ కి 152 అని చెప్పడంలో సందేహమే లేదు. వీరితో వైసీపీ కచ్చితంగా ఆ నాలుగు సీట్లు గెలవడం ఖాయమని తెలుస్తుంది. అయితే ఆ నలుగురు ఎవరా అని అందరు అనుకుంటున్నారు. కాని జగన్ మాత్రం ఆ నలుగురిని ఇప్పటికే ఫిక్స్ చేసారని వార్తలు వస్తున్నాయి.
ఇక ఎవరా నలుగురు అనే విషయానికి వస్తే అయోధ్య రామిరెడ్డి.. ఈయన రాంకీ అధినేతగా అందరికి పరిచయం. అంతేకాకుండా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కి సోదరుడు కూడా. ఇక రెండో వ్యక్తి వైవీ సుబ్బారెడ్డి..ఈయన జగన్ కి బంధువు కూడా. ఈయన ప్రస్తుతం టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఇక మూడో వ్యక్తి ఇటీవలే పార్టీలో చేరిన బీద మస్తాన్ రావు. ఈనకు కూడా రావొచ్చని జోరుగా వార్తలు వస్తున్నాయి. దానికితోడు ఈయన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి సన్నిహితుడు కూడా. ఇక నాలుగో వ్యక్తి గోకరాజు గంగరాజు..ఈయన ఇటీవలే ఆయన సోదరులతో పాటుగా వైసీపీలో చేరారు. జగన్ రెండు నెలలు ముందుగానే ఈ వీళ్ళని ఫిక్స్ అయ్యారని వార్తలు వస్తున్నాయి.