మీరు ఫుల్ గా తాగుతారా…?. మత్తు లేనిదే రాత్రి పడుకోరా..?. ఉదయం లేవగానే మత్తు దిగదా..?. దీంతో ఏమి చేయాలో తెలియక మదనపడుతుంటారా..?. బాస్ ను అడిగితే సెలవు ఇవ్వడా..?.
అయితే ఇక్కడ మాత్రం ఫుల్ తాగి .. దిగకపోతే సెలవు ఇస్తామంటున్నారు. ఎక్కడంటే ఇంగ్లాండ్ లోని ఒక డిజిటల్ మార్కెటిం కంపెనీ హ్యాంగ్ ఓవర్ డే పేరుతో ఒక వినూత్న సెలవును ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఒకవేళ రాత్రివేళ ఉద్యోగులు ఎవరైనా తాగి ఉదయానికి కూడా వారికి మత్తు దిగకపోతే ఈ సెలవును వాడుకోవచ్చు. రాత్రి పూట ఏదైనా కారణంతో నిద్రపోకుండా ఉంటే కూడా ఈ సెలవును వాడుకోవచ్చు అని సదరు కంపెనీ తెలిపింది.