40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఎన్నడూ తాను సొంతంగా పోటీ చేసి గెలిచింది లేదు. తాను సీఎం గా ఉన్న ప్రతీసారి ఎవరోకరి అండతోనే గెలిచారని చెప్పాలి. ఇక గత ఎన్నికలు అంటే 2014ఎన్నికల విషయానికి వస్తే చంద్రబాబు తో అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటు బీజేపీ కలిసి సపోర్ట్ చేసారు. అలా చేసినప్పటికీ వైసీపీ కూడా ఎక్కువ సీట్లు గెలుచుకుంది. అయితే ఈ ఎన్నికలు చూసుకుంటే పవన్, బీజేపీ ఎవరూ లేరు.చంద్రబాబు కనీస సీట్లు గెలవకుండా దారుణంగా ఓడిపోయారు. ఇంత దారుణంగా ప్రజలు ఛీ కొట్టినా బాబుకి ఇంకా బుద్ధి రాలేదు.
ఇప్పటికీ తన ప్రచారంలో మహనీయులను సైతం వాడుకోవడం ఆయనకు అలవాటు. అప్పుడేమో అబ్దుల్ కలాం కోసం మాట్లాడిన విషయం అందరికి తెలిసిందే. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి చంద్రబాబు గాలి మొత్తం తీసేసాడు. “నీ ప్రచార పిచ్చికి అంబేద్కర్ మహాశయుడి పేరు కూడా వాడుకుంటున్నావు కదా చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ ఆయనకు భారతరత్న ఇప్పించిందా? బాబాసాహెబ్ కు అర్హత లేకున్నా మీరే ఇప్పించారన్నట్టు అవమానిస్తున్నారు కదా బాబూ? ఆలస్యంగానైనా ఆయనను భారతరత్నతో గౌరవించిందీ దేశం. మధ్యలో మీరెవరు?” అని ప్రశ్నించారు.