ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఎక్సైజ్ చట్టం సవరణ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీల మధ్య వాడీ వేడి చర్చ జరిగింది. రాష్ట్రంలో దశలవారీగా మద్యనిషేధం చేస్తానని చెప్పి…ప్రభుత్వమే మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తుందని, మద్యం ధరలు విపరీతంగా పెంచేశారని చంద్రబాబు ఆరోపించారు. చంద్రబాబు ఆరోపణలకు వైసీపీ మహిళా ఎమ్మెల్యే విడుదల రజనీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. అధ్యక్షా నాకు గోరంటి వెంకన్న రాసిన పల్లె కన్నీరు పెడుతుంది అనే పాటు గుర్తుకువస్తుంది అని రజనీ అన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో ఏపీలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరిగాయని, మద్యం వల్ల పల్లెలు కన్నీరు పెట్టాయని విడుదల రజనీ అన్నారు. ఏపీలో ఎన్నో కుటుంబాలలో కన్నీరు నింపిన పాపం చంద్రబాబుదేనని రజనీ మండిపడ్డారు. మహిళలు పోరాటం చేస్తే ఎన్టీఆర్ గారు మద్యనిషేధం అమలు చేశారని..అయితే ఆయనకు వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు మద్యం పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి మహిళలు ముఖాల్లో సంతోషం లేకుండా చేశారని ఆమె ఆరోపించారు. టీడీపీ సర్కార్ హయాంలో అత్యాచార కేసుల్లో 90 శాతం వరకు మద్యం మత్తులోనే చేశారని పోలీసుల రికార్డులు చెప్తున్నాయని అంటే అప్పట్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు విడదల రజిని. గతంలోఇష్టం వచ్చిన ధరలకు మద్యం అమ్ముతున్నా.. టిడిపి ప్రభుత్వం కళ్ళులేని కబోదిలా వ్యవహరించిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటలు మద్యం విక్రయాలు కొనసాగుతున్న పట్టించుకునే దిక్కులేదని , అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ ఉండేవారని ఆమె పేర్కొన్నారు. టిడిపి హయాంలో గ్రామాల్లో ఒక నానుడి ఉండేదని చెప్పిన విడుదల రజని ఏపీలో మంచినీళ్లు దొరకవు కానీ మద్యం మాత్రం ఏరులై పారుతుందని అనుకునేవారని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యానికి సారా ఎలా హానికరమో అలాగే ఆంధ్రప్రదేశ్ కి కూడా నారా హానికరం అని ఎద్దేవా చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ నారా వద్దు ఆ సారా వద్దు అని అన్నారని ఆమె పేర్కొన్నారు. అందుకే గత ఎన్నికల్లో టీడీపీని చావు దెబ్బ కొట్టారని రజిని అన్నారు. ఆరోగ్యానికి సారా హానీకరం..ఆంధ్రప్రదేశ్‌కు నారా హానీకరం అంటూ విడుదల రజనీ వేసిన సెటైర్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మేడమ్..మీ సెటైర్ అదిరిపోయింది.. జింగ్ జింగ్..అమేజింగ్ అంటున్నారు.
