ప్రముఖ వాణిజ్య సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో రికార్డును సృష్టించింది. గత ఏడాది ఆర్థిక సంవత్సరంలో రూ.5.81లక్షల కోట్ల ఆదాయంతో ఇండియాలోనే అతిపెద్ద కంపెనీగా నిలిచి చరిత్ర సృష్టించింది.
ఫార్చ్యూన్ ఇండియా 500 జాబితాలో పదేళ్ళ పాటు అగ్రస్థానంలో ఉన్న ఇండియన్ ఆయిల్స్ కార్పొరేషన్ ని వెనక్కి నెట్టి మరి టాప్ ప్లేస్ ను దక్కించుకుంది రిలయన్స్.
ఇరవై ఆరు శాతం వృద్ధి రేటుతో రూ.5.36లక్షల కోట్ల ఆదాయంతో ఐఓసీ రెండో స్థానానికి పడిపోయింది. ఓఎన్జీసీ,ఎస్బీఐ,బీపీసీఎల్ తర్వాత స్థానాల్లో నిలిచాయి.