సిసిఎస్ రద్దుపై ప్రభుత్వం కట్టుబడి వుందని మంత్రి తానేటి వనిత, ఆదిమూలపు సురేష్ లు స్పష్టం చేశారు. అందుకోసం ఇప్పటికే మంత్రుల కమిటీని నియమించడం పూర్తయిందని ఆ కమిటీ ఇప్పటికే రెండుసార్లు ఈ అంశంపై భేటీ అయ్యిందని తెలియజేశారు. మంత్రుల కమిటీకి సూచనలు ఇచ్చేందుకు సిఎస్ నేతృత్వంలో సీనియర్ ఐఎఎస్ అధికారులతో వర్కింగ్ కమిటీని కూడా నియమించడం జరిగింది.ఈ కమిటీ వచ్చే ఏడాది మార్చి 31నాటికి తన నివేదికను మంత్రుల కమిటీకి సమర్పించాలని ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. సిసిఎస్ రద్దు తరువాత ఉద్యోగులకు ఏరకంగా పెన్షన్ ను ఇవ్వాలి అనే అంశంపై సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయని, ఆర్థికపరమైన అంశాలను కూడా ఈ సందర్బంగా పరిశీలించాల్సి వుందని , వాటికి అనుగుణంగా ఉద్యోగులకు మేలు చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సిపిఎస్ రద్దుపై శాసనమండలిలో రాష్ట్ర మంత్రులు శ్రీమతి తానేటి వనిత, శ్రీ ఆదిమూలపు సురేష్ పూర్తి వివరణ ఇచ్చారు. అవశరం అయితే ఉద్యోగి సంఘాల నాయకుల అభిప్రాయాలను తీసుకుంటామని తెలియజేశారు.
