నడి రోడ్డుపై ఓ ప్రేమ జంట గొడవకు దిగిన ఘటన కర్ణాటకలోని బొమ్మనహళ్లిలో చోటు చేసుకుంది. ప్రియుడు ప్రియురాలిపై దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో అవి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పోలీసుల వివరాల మేరకు.. ఈ జంట బైక్పై వస్తూ ఓ చోట కిందకు దిగి వాగ్వాదానికి దిగారు. ఇదే క్రమంలో యువకుడు యువతిపై దాడికి యత్నించాడు. విషయాన్ని గుర్తించిన ఓ వ్యక్తి అడ్డుకునే యత్నం చేశారు. ఈ సమయంలో మరికొంత మంది అక్కడికి చేరుకుని దృశ్యాలను మొబైళ్లలో రికార్డు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరిని నిలదీశారు. ఇద్దరం ప్రేమించుకుంటున్నామని, ఇంటిలో గొడవ కారణంగా ఇలా జరిగిందని చెప్పడంతో ఇద్దరిని పోలీసులు హెచ్చరించి పంపించారు.