వచ్చే ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య వన్డే సిరీస్ జరగనుంది. ఇందులో మొత్తం మూడు వన్డేలు జరగనున్నాయి. అయితే తాజాగా ఇండియా టూర్ కు ఆస్ట్రేలియా బోర్డు జట్టుని ప్రకటించింది. అయితే సొంతగడ్డపై ఆస్ట్రేలియా ఫుల్ ఫామ్ లో ఉందని చెప్పాలి. మరోపక్క ఇండియా విషయానికి వస్తే ప్రస్థితి ఎలా ఉందో యావత్ ప్రపంచం గమనిస్తూనే ఉంది. ఇక ఆస్ట్రేలియా జట్టు వివరాల్లోకి వెళ్తే..ఆరోన్ ఫించ్ (C), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, పీటర్ హాండ్స్ కుంబ్, మర్నుస్ లబుస్చాగ్నే, అలెక్ష్ కారీ(VC), ఆస్టన్ టర్నర్, పాట్ కమ్మిన్స్, హజ్లేవుడ్, రిచర్డ్సన్, స్టార్క్, అబోట్, ఆడమ్ జంపా. ఇక ఇండియా ప్రస్తుతం వెస్టిండీస్ తో వన్డే సిరీస్ ఆడుతుంది.
