దేశంలో ప్రస్తుతం 130 కోట్ల మందికి పైగా జనాభా ఉన్నారు. కానీ పెరిగిన జనాభాకు అనుగుణంగా లోక్ సభకు ప్రాతినిధ్యం వహించే వారి సంఖ్య లేదని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. భారత్ పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించే స్థానాలు సంఖ్యను 543 కాగా వాటిని 1000కు పెంచాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అబిప్రాయపడ్డారు. 1971 జనాభా లెక్కల ప్రకారం భారత్ జనాభా 55 కోట్లు మాత్రమేనని దానికి అనుగుణంగా 1977 లో 543 లోక్ సభ స్థానాలను ఏర్పాటు చేశారని ప్రస్తుతం ఇంకా వాటినే కొనసాగిస్తున్నామని, సుమారు 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన విధి విధానాలను ప్రస్తుతం పెరిగిన జనాభా ఆధారంగా మార్చవలసిన అవసరం ఉన్నదని, ప్రస్తుత జనాభా 130 కోట్లు దాటిందని అన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా పరిపాలన యంత్రాంగం లో మార్పులు తీసుకురావలసి ఉన్నదని లోక్ సభ స్థానాలను 1000 కి పెంచాలని అలానే రాజ్యసభ సభ్యుల సంఖ్య కూడా పెంచాలని ఆయన అన్నారు. ఇండియా ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకోపన్యాసం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Tags candiadates increasing loksabha Rajya Sabha
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023
లోకేష్ ఓ పనికిమాలిన పొలిటీషియన్..ఏం మాట్లాడుతాడో వాడికే అర్థం కాదు..మంత్రి రోజా ఫైర్..!
August 30, 2023
NTR Coin : ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమాన్ని కూడా తన రాజకీయాలకు వాడుకుంటున్న బాబు ..
August 28, 2023
AP Politics:రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్లపై నిషేధం విధించిన ఏపీ ప్రభుత్వం ..
August 28, 2023
CM Jagan:పేద విద్యార్థుల పెద్ద చదువులకు అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వానిదే .. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం..
August 28, 2023
Fees Reimbursement :పిల్లల భవిష్యత్తు మార్చబోయే పథకమైన విద్యా దీవెన నిధులు సీఎం జగన్ చేతుల మీదిగ విడుదల
August 28, 2023
పవన్ కళ్యాణ్ విసన్నపేట పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది – మంత్రి అమర్నాథ్
August 14, 2023
నీకు దమ్ముంటే బిల్కిస్ బానోతో రాఖీ కట్టించుకో- ప్రధాని మోదీకి మహా మాజీ సీఎం థాకరే సవాల్
August 8, 2023