గత ఐదేళ్ళ చంద్రబాబు పాలనలో రాష్ట్రం విలవిల్లాడిపోయింది. రైతులు, విద్యార్ధులు, నిరుద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు ఇలా ప్రతీఒక్కరూ చాలా ఇబ్బందులు పడ్డారు. 2014 ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు మాయమాటలు చెప్పి వారికి ఆశలు కల్పించి, హామీలు ఇచ్చి చివరికి గెలిచిన తరువాత అందరిని గాలికి వదిలేసాడు. రైతులు అయితే ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. దాంతో బాబుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నారు. మరోపక్క వైసీపీ అధినేత జగన్ మాత్రం ప్రతిపక్షంలో ఉంటూ కూడా ప్రజల తరపున పోరాడాడు. తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతీ హామీ ప్రజలకు ప్రజలకు మేలు చేసే విధంగానే ఉన్నాయి.
దాంతో రాష్ట్రమంతా జగన్ ని అఖండ మెజారిటీతో గెలిపించారు. గెలిచిన తరువాత సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన క్షణం నుండి నిరంతరం తాను ఇచ్చిన హామీలు కొరకు కృషి చేస్తున్నారు. ఈ ఆరు నెలల కాలంలోనే ఎన్నో హామీలు నిర్వేర్చారు. ఇక అసలు విషయానికి వస్తే టీడీపీ హయంలో కాంట్రాక్టు ఉద్యోగుల విషయానికి వస్తే అందరు రాజకీయ పలుకుబడితో చేరినవారే. అయితే వారిని మినహాయించి మిగతావారిని తాజాగా ఆర్ధికమంత్రి బుగ్గన కష్టపడే వారే శ్రమ వృధా కాకూడదని భావించి అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల అర్హత, సర్వీసును పరిగణలోకి తీసుకుని వీలైనంతమందిని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పడం జరిగింది. దాంతో అందరి కళ్ళల్లో ఆనందం కనిపించింది.