కర్నూలు మాజీ ఎంపీ బుట్టారేణుక..ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన రేణుక..ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల్లో పెద్దగా కనిపించడం లేదు. 2014 ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బుట్టా రేణుకకు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో జగన్ ఎంతో మంది సీనియర్లు ఉన్నా పక్కనపెట్టి కర్నూలు ఎంపీ టికెట్ బుట్టా రేణుకకు ఇచ్చాడు.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిపై గెలిచి రేణుక పెద్ద సంచలనమే సృష్టించారు. అయితే చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా బుట్టా రేణుక టీడీపీలోకి ఫిరాయించారు. వందల కోట్ల కోట్ల కాంట్రాక్టులు ఇస్తానని బాబు ఆశపెట్టి మరీ రేణుకను తన పార్టీలో చేర్చుకున్నాడు. టీడీపీలో చేరడంతో బుట్టా రేణుక ఇమేజ్ పూర్తిగా డ్యామేజీ అయింది. అయితే వాడుకుని వదిలేసే చంద్రబాబు బుద్ధి బుట్టాకు తొందరగానే అర్థమైంది. తాను టీడీపీలోకి వచ్చి ఎంత పెద్ద పొరపాటు చేశానో ఆమె గ్రహించింది. దీంతో మళ్లీ 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు తిరిగి వైసీపీలో చేరారు. బుట్టా చేరికను పార్టీలో పలువురు నేతలు, కార్యకర్తలు వ్యతిరేకించినా..జగన్ మాత్రం పెద్ద మనసుతో ఆదరించాడు. ఈ సందర్భంగా బుట్టారేణుక ఎమోషనల్ అయింది. చిన్న మిస్ అండర్‌స్టాండింగ్‌తో పెద్ద తప్పు చేశా. తాను చేసిన తప్పునకు శిక్ష కూడా అనుభవించా… జగనన్న నన్ను సాదరంగా ఆహ్వానించారు. అన్కండీషనల్గా వచ్చేశా. ఏదీ ఆశించట్లేదు అంటూ పార్టీలో చేరిన సందర్భంగా బుట్టా రేణుక చెప్పుకొచ్చారు..అయితే అప్పటికే అభ్యర్థుల ఎంపిక ఖరారు కావడంతో కర్నూలు లోకసభ నియోజకవర్గం పరిధిలో వైసీపీ అభ్యర్థుల తరపున రేణుక ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత..బుట్టాకు ఏదైనా పదవి ఇస్తారని ప్రచారం జరిగింది.అయితే ఆమె మాత్రం ఎటువంటి పదవులు ఆశించనని చెప్పారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బుట్టారేణుక పార్టీ కార్యక్రమాలలో పెద్దగా కనిపించడం లేదు..తన వ్యాపార కార్యకలాపాలలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తన కుమారుడి పెళ్లి పనుల్లో రేణుక బిజీగా ఉన్నారు. అయితే తాజాగా రాజకీయాలకు దూరమవుతున్నారన్న వార్తలపై బుట్టారేణుక స్పందించారు. ప్రస్తుతం రాజకీయాలకు గ్యాప్ ఇచ్చానే కానీ..పూర్తిగా తప్పుకోలేదని తన సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇక నుంచి రాజకీయాల్లో ఉన్నంత కాలం ఒక్క జగనన్నను తప్ప మరొకరిని నమ్మను అని రేణుక స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బుట్టారేణుకకు ఎమ్మెల్సీ లేదా..రాజ్యసభ ఎంపీ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా తనను తిరిగి పెద్ద మనసుతో ఆదరించిన జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని బుట్టా రేణుక చెబుతోంది. మరి సీఎం జగన్ ఎంతో అభిమానించే బుట్టా రేణుకకు ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఎంపీ పదవి దక్కుతుందో లేదో చూడాలి.
