మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులకు కఠిన శిక్షలు పడేలా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ చట్టం దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతుంది. మహిళలు,చిన్నారుల పై నేరాలకు పాల్పడే వారిని గుర్తించి,త్వరితగతిన విచారణ పూర్తిచేసి నిందితులకు శిక్షలు పడేలా ఈ చట్టాన్ని రూపొదించారు. చారిత్రాత్మక దిశా చట్టాన్ని తీసుకొచ్చిన జగన్ సర్కారు కు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ చట్టం తమ రాష్ట్రాలలో కూడా అమలు కావాలని కోరుకుంటున్నారు.
జగన్ సర్కారు తీసుకొచ్చిన దిశా చట్టాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభినందించారు. ఆ బిల్లు పత్రాలని తమకి పంపించాలని కేజ్రివాల్ కోరినట్టు స్పీకర్ నిన్న అసెంబ్లీలో తెలిపారు. తాజాగా దిశా చట్టాన్ని ఒడిశా ప్రభుత్వం కూడా అభినందించింది. బిల్లుకు సంబందించిన వివరాలను తమకు ఇవ్వాలని ఒడిశా ప్రభుత్వం కోరినట్టు స్పీకర్ తమ్మినేని అసెంబ్లీలో తెలిపారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశా చట్టానికి దేశవ్యాప్తంగా అభినందనలు రావడం నిజంగా గర్వించదగ్గ విషయం..