ఎమ్మెల్యే ధర్మాన అసెంబ్లీ సాక్షిగా తన భావోద్వేగాన్ని వ్యక్తం చేసారు. గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాకు ఏం చేసారని ప్రశ్నించారు. ప్రభుత్వ పాలన అంటే రాష్ట్రంలో కొన్ని చోట్లే కాదని అన్ని చోట్ల ఎక్కడైతే పని జరగాలో అక్కడ చేయించాలని అన్నారు. చంద్రబాబు పాలనలో తన సొంతవారు, కుటుంబం సభ్యులకే పనులు చేసుకున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. గత ఐదేళ్ళలో కేంద్రం 23 విద్యాసంస్థలను ఇస్తే శ్రీకాకుళం జిల్లాలో ఒక్క సంస్థ కూడా ఏర్పాటు కాలేదు. బాబుకు అనేక సార్లు అధికారం ఇచ్చిన మా జిల్లాకు ఒక్క సంస్థ కూడా ఇవ్వలేకపోయారా? అని ప్రశ్నించారు.