ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజదాని అమరావతిలో ఒక సామాజికవర్గం వారు మాత్రమే లేరని,అన్ని వర్గాల వారు ఉన్నారని, బలహీనవర్గాల వారు అదికంగా ఉన్నారని వాదించారు. కాని ఒక సామాజికవర్గం కోసం రాజధాని అని ప్రచారం చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించగా, ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి సంచలన రీతిలో సమాధానం ఇచ్చారు.రాజదానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ కాని, అస్సైన్డ్ భూములు కాని ఎవరెవరు కొనుగోలు చేసిందీ పేర్లతో సహా వివరించి మొత్తం స్కామ్ ను బయటపెట్టారు. అందులో కూడా బుగ్గన చదివిన పేర్లలో మెజార్టీ ఒకే సామాజికవర్గానికి చెందినవారివి కావడం వారి ఇంటి పేర్లను కూడా ఆయన చదివారు.ఆ ఇళ్ల పేర్లను వింటుంటే తొంభైశాతం పైగా కమ్మ సామాజికవర్గం వారు ఆ భూములను అక్రమంగానో,సక్రమంగానో కొనుగోలు చేశారని బుగ్గన బయటపెట్టారు.చంద్రబాబు హెరిటేజ్ కంపెనీ తో సహా ఆయా పేర్లను వెల్లడించడం ద్వారా బుగ్గన గుట్టును రట్టు చేశారు.
