ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ బిల్ 2019 పై ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి పాముల పుష్పశ్రీవాణి అసెంబ్లీలో ప్రసంగించారు. గిరిజనుల హక్కులను కాపాడేందుకే ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసినట్లు తెలియజేస్తూ రాష్ట్ర చరిత్రలో రాష్ట్ర విభజనకు ముందు గానీ తర్వాత గానీ ఏ ప్రభుత్వం చేయని ఆలోచన సీఎం వైయస్ జగన్ చేశారని ఆ ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. గిరిజనుల పై ఆయనకున్న ప్రత్యేక శ్రద్ధకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ బిల్లు తలమానికమని సీఎం జగన్ ను ప్రశంశలతో ముంచెత్తారు.
చరిత్రలో గిరిజనుల హక్కుల కోసం పోరాడిన మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజైతే ప్రస్తుత కాలంలో ఎస్టీ కమిషన్ ద్వారా గిరిజనుల గుండెల్లో మరో అల్లూరిగా నిల్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. గిరిజన ప్రాంతాలంలో దీపం లేని గూడు ఉంటుందేమో కానీ, వైయస్సార్‌ని ఆరాధించని గుండె మాత్రం ఉండదు అన్నారు. మరో వందేళ్లు కూడా చూస్తామో లేదో అన్న పథకాలను గిరిజనలుకు కేవలం వంద రోజుల్లోనే చేసి చూపించిన ఘనత మా ముఖ్యమంత్రిదే గత ప్రభుత్వం గిరిజనులకు కనీసం మంత్రి పదవి ఇవ్వకపోతే, మా నాయకుడువైయస్ జగన్ ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవినిచ్చారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతీ అభివృధ్ది కార్యక్రమం గిరిజనుల అభివృధ్ది దోహదపడుతుందని ఆమె వ్యాఖ్యానించారు.