కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత ఈశ్వర్ దయాళ్ స్వామి కొన్ని రోజులుగా గుండె జబ్బుతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫరీదాబాద్‌లోని ఆసుపత్రిలో ఆదివారం మరణించారు. 1929 ఆగస్టు 11న అంబాలా జిల్లాలోని బాబియల్‌లో జన్మించారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో 1999లో కేంద్రమంత్రిగా పనిచేశారు. స్వామి మరణంపై పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన ఆయన రెండుసార్లు లోక్‌సభ సభ్యుడుగా ఎంపికయ్యారు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాగా గతవారంమే స్వామి భార‍్య పద్మ కన్నుమూశారు. భార్య భర్తలు ఇద్దరు మూడు రోజుల వ్యవధిలోనే మరణించడం వారి కుటుంబంలో తీవ్ర విషాదం ఛాయలు నెలకొన్నాయి.
Tags bjp died former union minister Husband wife
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023