తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లో రవీంద్రభారతి లో జరిగిన తెలంగాణ రాష్ట్ర వయోధికుల వార్షిక సమ్మేళనం లో రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ”వృద్దులు దేశానికి సంపద .పుస్తకాలు చదివినా రాని అనుభవం వృద్దులది.తల్లిదండ్రులను పట్టించుకోని వాడు మనిషే కాదు.బాల్యానికి శిక్షణ, యవ్వనానికి లక్ష్యం.వృద్దులకు రక్షణ ఉండాలి.వృద్దులు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి.శరీరం బలహీనంగా ఉన్నా….అనుభవం వృద్దుల సొంతం.
పుస్తకాలు చదివినా రాని అనుభవం వృద్ధులది.అపార అనుభవం ఉన్న వృద్దులుచక్కటి ఆలోచనలు ప్రభుత్వంతో పంచుకోవాలి.రాష్ట్రాన్ని, సంక్షేమం, అభివృద్ధి దిశగా సీఎం కేసీఆర్ నడిపిస్తున్నారు. రాష్ట్రాన్ని హరిత తెలంగాణ, బంగారు తెలంగాణ గా మార్చాలన్న ప్రయత్నృలో ఉన్నారు.మీరంతా వీటిల్లోభాగస్వాములయి మీ ఆలోచనలు పంచుకోవాలి.వృద్దాప్య పింఛన్లు 200 నుంచి 2000 వరకు సీఎం కేసీఆర్ పెంచడంతో వృద్దుల ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం పెరిగింది.సమాజంలో తల్లిదండ్రులను ఒంటరి చేస్తున్నారు. వారికి కావాల్సింది ప్రేమ, ఆప్యాయతలే
వృద్ధాప్యం బాల్యం లాంటిదే. పసి పిల్లలకు ఉండే మనసే తల్లిదండ్రులకు ఉంటుంది.బాల్యానికి శిక్షణ, యువతకు లక్ష్యం, వృద్దులకు రక్షణ ఉంటేనే ఆ సమాజం ఆరోగ్యమైంది.వృద్దుల పట్ల చిన్నచూపు తగదు. వారి పట్ల ఎలా వ్యవహరించాలి అన్న దానిపై పాఠ్యాంశాలు ఉండాలి.మన ధర్మాన్ని, సంస్కృతిని కాపాడాలి. పిల్లలకు చిన్నప్పటి నుండి శిక్షణ ఇవ్వాలి.మీ అనుభవాన్ని 30 రోజుల ప్రణాళిక,హరిత హరం వంటి వాటిల్లో వినియోగించాలి.మీ సమయాన్ని విద్యార్థులతో గడిపేందుకువెచ్చించాలి. వారికి సంప్రదాయాలు, నైతిక విలువలను నేర్పండి.మిషన్ భగీరథ వంటి పథకాలు బాగా పని చేసేలామీ అనుభవాలు పంచుకోండి.
చట్టం, ప్రభుత్వం చేయలేని పనులుమీ పెద్దరికం వల్ల గ్రామాల్లో చేయగలరు.స్వచ్చ తెలంగాణ కోసంకృషి చేయండి.మీ సమస్యల పరిష్క్బ కృషి చేస్తాం.సీఎం గారితో మాట్లాడి ఆర్డీవో ఆధ్వర్యంలోని వృద్ధుల కోసంఏర్పాటయిన ట్రిబ్యునల్స్ బాగా పని చేసేలా చర్యలు తీసుకుంటాం.యోగా, ప్రాణయామం చేయండి” అని అన్నారు.
Post Views: 249