ఏపీ ప్రభుత్వం తెచ్చిన దిశ చట్టం తర్వాత కూడా అత్యాచారాలు ఆగలేదని, ఇది సిగ్గుచేటు అని యనమల చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఇలాంటి పిచ్చి ప్రకటనలు చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అత్యాచారాలకు పాల్పడిన వారిపై చర్యలు లేవా..? అని యనమల ప్రశ్నించారు. ప్రకాశం, గుంటూరు జిల్లాలలో జరిగిన అత్యాచార ఘటనల గురించి ఆయన మాట్లాడారు. చట్టం చేసేస్తే మొత్తం నేరాలన్నీ ఆగిపోతాయని సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన యనమల అంటున్నారా? ఇది తెలివైన ప్రకటనేనా? అలాగైతే టిడిపి హయాంలో జరిగిన వేల అత్యాచారాలపై యనమల ఏమి సమాధానం చెబుతారు అంటూ రాజకీయ విశ్లేషకులు యనమల వ్యాఖ్యలపై విరుచుకు పడుతున్నారు.దిశ చట్టం పై ఆయన పూర్తి అవగాహన తెచ్చుకోవాలని చట్టం దృష్టిలో అందరూ సమానులేనని నేరం చేసినవాళ్లకు కఠినమైన శిక్షలు తప్పవంటూ బదులిచ్చారు.
