పురాతన ప్రసిద్ధి ఎల్లకొండ శ్రీ పార్వతి పరమేశ్వరులను పుణ్యక్షేత్రంలో సోమవారం రోజున అభిషేకం, అర్చన, అమ్మవారికి పట్టు వస్త్రాలు, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు మాజీ ఎంపీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత,చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులు నిర్వహించారు.
దేవాలయాని పూర్తిగా పరిశీలన చేసి, ఎమ్మెల్యే యాదయ్య, ఎల్లకొండ దేవాలయ చైర్మన్ భరత్ రెడ్డితో శ్రీ పార్వతి పరమేశ్వరుల దేవాలయ మరియు పురాతన కట్టడం అయినా శంభుని గుడి అభివృద్ధి కోసం దేవాదాయ శాఖతో మాట్లాడాలనీ చెప్పారు.శ్రీ పార్వతి పరమేశ్వరులను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉండని వారు చెప్పారు.
దీనిలో దేవాలయ చైర్మన్ భరత్ రెడ్డి, సర్పంచ్ రావుగారి వెంకట్ రెడ్డి, మండలాధ్యక్షుడు నాగిరెడ్డి, కో అప్షన్ సభ్యుడు గౌస్, మాజీ zptc రాంరెడ్డి, దేవాలయ అర్చకులు నాగరాజు స్వామి, శివకుమార్ స్వామి, సాయికుమార్ స్వామి, గ్రామస్థులు పాల్గొన్నారు