దేశమంతా ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్న కొన్ని దశాబ్ధాల అయోధ్య స్థల వివాదం కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యంగ ధర్మాసనం అయోధ్య స్థలాన్ని అయోధ్య ట్రస్టుకు మూడు నెలల్లోనే కేటాయించాలని తీర్పునిచ్చింది. అయితే తాజాగా ఝార్ఖండ్ పార్టీ ర్యాలీలో అమిత్ షా అయోధ్య గురించి మాట్లాడారు. వచ్చే నాలుగు నెలల్లో అయోధ్యలోని రామ మందిరం పూర్తి చేస్తామని ఆయన అన్నారు.