తెలంగాణ ఆర్టీసీకి చెందిన కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు తీపి కబురును అందించారు. ఆర్టీసీ కార్మికులు గతంలో నిర్వహించిన యాబై రెండు రోజుల సమ్మెకాలపు జీతాన్ని చెల్లించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగ ఉంది అని ప్రకటించారు.
ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాము. కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారని ఆయన తెలిపారు.
ఈ రోజు సోమవారం మంత్రి హారీష్ రావు పఠాన్ చెరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.