ఆదివారం చేపాక్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ జరిగింది. అయితే ముందుగా టాస్ గెలిచి పోల్లార్డ్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఇక బ్యాట్టింగ్ కి వచ్చిన భారత్ టాప్ ఆర్డర్ తక్కువ పరుగులకే ఔట్ అవ్వడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం వచ్చిన ఇయ్యర్, పంత్, జాదవ్ పరిస్తుతులను చక్కదిద్ది జట్టు స్కోర్ ను 287కి తీసుకెళ్ళారు. అయితే చేసింగ్ కి దిగిన విండీస్ ఆటగాళ్ళు అద్భుతమైన బ్యాట్టింగ్ తో ఘనవిజయం సాధించారు. ఇక అసలు విషయం ఏమిటంటే జట్టు వైఫల్యానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే బౌలింగ్ అనే చెప్పాలి. బహుసా కెప్టెన్ కోహ్లి విండీస్ ను తేలికగా తీస్కోని బౌలర్స్ తో పని ఉండదు అనుకున్నాడో ఏమో మరి. మిడిల్ లో వికెట్స్ ఎటాకింగ్ బౌలర్స్ లేకపోవడంతో జట్టుకు చాలా ఇబ్బంది వచ్చింది. ఈ విషయంలో కోహ్లిపై నేటీజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు.
