తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులోభాగంగా కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా కొనసాగుతున్న కే. శశాంకను కరీంనగర్ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. సర్ఫరాజ్ అహ్మద్‌ను ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా నియమించింది. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతికి అదనపు బాధ్యతలు అప్పగించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అదనపు డీజీగా డాక్టర్ ఏ అశోక్‌ను నియమించింది. ఎంసీహెచ్‌ఆర్డీ అదనపు డీజీగా కొనసాగుతున్న బుసాని వెంకటేశ్వర్లును విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.