కరువు నేలపై కాళేశ్వరం నీళ్లు పారయి అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పబలానికి ఇంతకు మించి మరో ఉదాహరణ ఉంటుందా అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.జెండకర్రలతో పారిన రక్తం మరకలు ఇప్పటికి సూర్యపేట, తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలను వెంటాడుతున్నాయని అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని టి ఆర్ యస్ ప్రభుత్వం సూర్యపేట కు గోదావరి జలాలు పరుగులు పెట్టిస్తుంటే ఆ మరకలు చేదిరిపోతున్నాయన్నారు .
అటువంటి సమయంలో నే ప్రతి ఒక్కరు గులాబీ గూటికి రావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చెప్పుకొచ్చారు.సోమవారం ఉదయం సూర్యపేట జిల్లా కేంద్రంలోని మంత్రి జగదీష్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సూర్యపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్ యస్ మండలానికి చెందిన కాంగ్రెస్ బిజేపీనేతలు వారివారి అనుచరులతో గులాబీ గూటికి చేరుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కాసింత ఆలస్యంగా అయిన రక్తం చిందించే పార్టీలను వదిలి సూర్యపేట జిల్లాకు నీరు పారించిన గులాబీ గూటికి చేరుకోవడం అంటే అభివృద్ధి ని అహ్హనించడమే అని ఆయన వర్ణించారు.
టి ఆర్ యస్ పార్టీలో చేరిన వారిలో ఆత్మకూరు ఎస్ మండలం పాత సూర్యాపేట కు చెందిన ఎంపీటీసీ రవి , వైస్ సర్పంచ్ సృజన అశోక్, వార్డ్ మెంబెర్స్ తో పాటు 300 మంది కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు మంత్రి సమక్షంలో టి.ఆర్.ఎస్ లో చేరారు.కాగా ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి తో పాటు ఎంపీ బడుగుల,టి.ఆర్.ఎస్ రాష్ట్ర కార్యదర్శి వైవీ. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపాగాని వెంకట్ నారాయణ్ గౌడ్, ఎంపీపీ మర్ల చంద్రా రెడ్డి, తూడి నర్సింహ రావు, బత్తుల ప్రసాద్ తదితర నేతలు పాల్గొన్నారు.
Tags guntakandla jagadeesh reddy kaleshwaram slider suryapeta telangana governament telanganacm telanganacmo trs trsgovernament