దేశ రాజధాని ఢిల్లీలో దళితుడికి రక్షణ లేదు. పొట్టకూటి కోసం.. జీవనం సాగించుకోవడం కోసం బిర్యానీ పాయింట్ పెట్టుకున్న దళితుడిపై దాడికి దిగారు కొందరు. అసలు విషయం ఏమిటంటే దేశ రాజధాని ఢిల్లీకి ఆరవై ఆరు కిలోమీటర్ల దూరంలో గ్రేటర్ నోయిడాలోని రాబుపురలో ఈ సంఘటన జరిగింది. నలబై మూడేళ్ల లోకేష్ అనే దళిత వ్యక్తి రోడ్డు వెంట చిన్న దుఖాణం పెట్టుకుని కూరగాయల బిర్యానీ విక్రయిస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. శుక్రవారం కొంతమంది దుండగులు కులం పేరుతో లోకేష్ ను తిడుతూ.. దాడికి దిగారు. ఇది శుక్రవారం జరిగిన దాడికి సంబంధించిన వీడియో నిన్న ఆదివారం వెలుగులోకి వచ్చింది
