Home / ANDHRAPRADESH / చంద్రబాబు నువ్వు రివర్స్ నడిచినా… బోర్లా పడుకుని పాకినా.. నిన్ను ఎవరు నమ్మరు..!

చంద్రబాబు నువ్వు రివర్స్ నడిచినా… బోర్లా పడుకుని పాకినా.. నిన్ను ఎవరు నమ్మరు..!

టీడీపీ అధినేత చంద్రబాబు బురద రాజకీయం కొనసాగుతోంది. అసెంబ్లీలో ప్రజా సమస్యలను పక్కనపెట్టి..పొలిటికల్ మైలేజీ కోసం రోజుకో టాపిక్ పట్టుకుని ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ రివర్స్  టెండరింగ్‌పై చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి వెనక్కి నడుస్తూ నిరసన వ్యక్తం చేశాడు. ఇది ప్రభుత్వం తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ కాదని రిజర్వ్ టెండరింగ్ అంటూ ఆక్రోశం వెళ్లగక్కాడు. అమరావతి ఆపేసారు..పోలవరం నిలిపేసారు అంటూ బ్యానర్ పట్టుకుని వెనక్కి నడుస్తూ బాబు ఓ రేంజ్‌లో డ్రామా రక్తి కట్టించాడు. కాగా గత ఐదేళ్ల బాబు హయాంలో పోలవరంతో సహా ప్రాజెక్టులు, ప్రభుత్వ పనుల్లో భారీగా జరిగిందని భావించిన జగన్ సర్కార్ గత టెండర్లను రద్దు చేసి కొత్తగా రివర్స్ టెండరింగ్‌కు వెళ్లింది. ఈ రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి రూ. 1400 కోట్లకుపైగా ప్రజాధనం ఆదా అయింది. ఒక్క పోలవరం ప్రాజెక్టులోనే 750 కోట్లకు పైగా ఆదా అయింది. రివర్స్ టెండరింగ్‌ ద్వారా కేవలం 5–6 వేల కోట్ల రూపాయల పనుల్లో దాదాపు 1400 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆదాయచేసింది. లేకుంటే..ఆ డబ్బులు కమీషన్ల రూపంలో బాబుగారి జేబులోకి పోయేవని క్లియర్‌గా అర్థమవుతుంది. తనకు రావల్సిన కమీషన్‌ పోయిందనే బాధతోనే ఇలా బాబు రివర్స్‌పై వెనక్కి నడుస్తూ తన ఆక్రోజాన్ని వెళ్లగక్కుతున్నాడు. రివర్స్ టెండరింగ్‌తో పెట్టుబడుదారులు ఏపీకి రాని పరిస్థితి కల్పించారంటూ బాబు కుతకుతలాడిపోతున్నాడు. అయ్యా బాబుగారు మీ హయాంలో ఏపీ కంటే బీహార్ నయం..ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వట్టి ప్రచారమే..ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే ముందు రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువ..లోపాయికారీ ఒప్పందం ప్రకారమే అన్నీ జరుగుతాయని జపాన్‌కు చెందిన మాకీ సంస్థ ఛైర్మన్ పుమిహికో తిట్టిపోలేదా…నీ హయాంలో అసలు ఏపీలో ఎన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి..ఎన్ని లక్షల ఉద్యోగాలు కల్పించావు అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కళ్ల ముందు రివర్స్ టెండరింగ్ ద్వారా కేవలం 5 – 6 వేల కోట్ల రూపాయల పనుల్లోనే 1400 కోట్లు మిగిలిన సంగతి కనిపించడం లేదా..ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లకుంటే..అదే పోలవరం పూర్తయ్యేసరికి కమీషన్ల పేరుతో ఎన్ని వందల కోట్లు వెనకేసుకునే వాడివో..అందుకే ఆ డబ్బులన్నీ పోయాయని ఇలా రివర్స్ టెండరింగ్‌పై రివర్స్‌గా నడుస్తూ ప్రభుత్వంపై పడి ఏడుస్తున్నావు…నువ్వు రివర్స్ కాదుకదా..బోర్లా పడుకుని పాకినా..నిన్ను ఎవరూ నమ్మరు అంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat