అసెంబ్లీలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా ముఖ్యమంత్రి జగన్ పై ప్రతిపక్ష నేత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సభా హక్కుల ఉల్లంఘన నియమం కింద అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో హక్కు ల నోటీసులు కూడా ఇచ్చారు. అయితే రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఇదో సంచలన విషయం. అయితే ఈపరిణామం చంద్రబాబుకు తనకు కలిసి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నా ఫలించట్లేదు.. అయితే ఈ ఘటనకు సంబంధించి పరిశీలిస్తే రాష్ట్ర శాసనసభకు ప్రవేశించే గేటు వద్ద చీఫ్ మార్షల్స్ నుద్దేశించి కొద్దిరోజుల క్రితం ప్రతిపక్షనేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ఈమొత్తం వ్యవహారానికి కారణం.. ప్లకార్డులు పట్టుకుని, నల్ల రిబ్బన్లతో అసెంబ్లీలోకి ప్రవేశించేందుకు చంద్రబాబు అండ్ బృందం ప్రయత్నించగా వారిని అడ్డుకునేందుకు మార్షల్స్ గేట్లు మూసివేయడంతో చంద్రబాబు బృందం ఆ గేట్లను తోసుకుంటూ ముందుకొచ్చారు. ఈక్రమంలో చంద్రబాబు అన్ పార్లమెంటరీగా వ్యవహరించారనేది వైసీపీ వాదన.. ముఖ్యంగా చీఫ్ మార్షల్‌ను పట్టుకుని చంద్రబాబు బాస్టర్డ్ అనడంతో దుమారం చెలరేగింది.
దీనిపై కొద్దిరోజులుగా సభలో గందరగోళం జరుగుతుంది. దీనిపై చంద్రబాబు అధికారపక్షంపై ఎదురు దాడి చేశారు. అసెంబ్లీ గేటు నుంచి లోపలకు రానివ్వకుండా చీఫ్ మార్షల్ నన్ను ఆపినప్పుడు నన్ను ఆపడానికి ఆయనెవరు..? నో క్వశ్చన్ అని నేనన్నాను. దానిని వక్రీకరించి బాస్టర్డ్ అన్నానని అబద్ధపు ఆరోపణ చేసి అసెంబ్లీలో నన్ను భయంకరంగా తిట్టారు.. ఈ వక్రీకరణకు ముఖ్యమంత్రి జగన్ నాంది పలకడం మరీ ఘోరం.. అంటూ చంద్రబాబు సభలో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసారు. ఈనేపథ్యంలో జగన్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ చంద్రబాబు స్పీకర్‌కు సభా హక్కుల నోటీసిచ్చారు. దీనిపై మరోసారి చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కన్నా కూడా జగనే పై చేయి సాధించే అవకాశం ఎక్కువగా ఉందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా జగన్ ని ఇరుకున పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నించడం ఆయన మార్షల్స్ ని తిట్టడం వీడియోలలో రికార్డవడం అందరూ చూడడంతో చంద్రబాబు వాదన కంఠశ్వాసగా మిగిలిపోతోంది.