మీ పాన్ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోలేదా? అయితే ఇప్పటికైనా త్వరపడండి. లేని పక్షంలో ఐటీ రిటర్న్స్ దాఖలులో చిక్కులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఈ నెలాఖరులోగా అనుసంధానం గడువు ముగియనున్నది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31లోగా తప్పనిసరిగా ఆధార్‌తో పాన్ నంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ప్రజలకు సూచించింది. రేపటి భవిష్యత్ నిర్మాణం కోసం, ఆదాయ పన్ను సేవలు సజావుగా పొందేందుకు గడువులోగా ఈ అనుసంధానాన్ని పూర్తిచేసుకోవాలని ఆదివారం పేర్కొంది. తొలుత ప్రకటించిన అనుసంధాన గడువు ఈ ఏడాది సెప్టెంబర్ 30తో ముగియగా, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆ గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించింది. కేంద్రం ప్రవేశపెట్టిన ఆధార్‌కు చట్టబద్ధత ఉందని సుప్రీంకోర్టు గత సెప్టెంబర్‌లో పేర్కొంది. ఐటీ రిటర్న్స్‌కు ఆధార్‌తో పాన్ అనుసంధానం తప్పనిసరని చెప్పింది.
