బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అలనాటి బాలీవుడ్ నటి గీతా సిద్ధార్థ కక్ శనివారం ముంబైలో కన్నుమూశారు. సరిగ్గా నలబై ఏడేళ్ల కిందట అంటే 1972లో గుల్జార్ మూవీ ద్వారా గీత పరిచయమయ్యారు. ఆ తర్వాత ఏడాది 1973లో దేశ విభజన అనంతరం జరిగిన పరిణామాలపై ఎంఎస్ సాత్యు తీసిన గరమ్ హవాలో నటించిన పాత్ర ద్వారా గీత గుర్తింపును పొందారు. ఈ సినిమాకు ఉత్తమ జాతీయ ఐక్యతా చిత్రం కేటగిరిలో జాతీయ అవార్డును లభించింది. అమీనా పాత్ర పోషించిన గీతా ప్రత్యేక స్మారక పురస్కారాన్ని సైతం
అందుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు హిట్ చిత్రాలైన షోలే,త్రిశూల్ ,డిస్కో డాన్సర్,రామ్ తేరి గంగా మైలి,నూరియా , దేశ్ ప్రేమీ, డాన్స్ డాన్స్ లాంటి పలు చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ప్రముఖ టీవీ డాక్యుమెంటరీ నిర్మాత సిద్ధార్థ కక్ తో ఆమె వివాహాం జరిగింది. గీత మృతిపట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు.
