అధికారంలో ఉన్నప్పుడు అమరావతి ప్రాంతంలోని విలువైన ప్రభుత్వ భూములను చంద్రబాబు ఇష్టారాజ్యంగా దోచుకున్నాడు. తన సామాజికవర్గ నేతలకు, పారిశ్రామికవేత్తలకు చవకధరకు కట్టబెట్టాడు…రాజధానిలో కోట్లాది విలువైన ప్రభుత్వ భూములను కేవలం ఎకరం 500, 1000 రూపాయలకే దోచిపెట్టాడు. అలాగే గుంటూరులో తన సొంత పార్టీ ఆఫీసు భవనానికి కూడా నిబంధనలను తొంగలో తొక్కి మరీ..ప్రభుత్వ స్థలాన్ని నామమాత్రం ధరకు కొట్టేసాడు. ఇప్పుడు ఆ అక్రమ వ్యవహారమే చంద్రబాబు మెడకు బిగుసుకుంటుంది. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, ఆత్మకూరులో 3.65 ఎకరాల భూమిని టీడీపీ ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం కేటాయిస్తూ 2017 జూన్ 22 న నాటి టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ భూమిని 99 ఏళ్లపాటు లీజు ప్రాతిపదికన కేటాయిస్తూ..ఏటా ఎకరానికి రూ.1000 ఫీజుగా నిర్ణయిచింది. అయితే రాజధాని ప్రాంతంలో అత్యంత విలువైన భూమిని నిబంధనలకు విరుద్దంగా 99 ఏళ్లకు కేటాయింపుకోవడమే కాకుండా..ఎకరాకు కేవలం 1000 రూపాయలు మాత్రమే ఫీజుగా నిర్ణయించుకున్నారని, తమ సొంత పార్టీ ఆఫీస్ భవన నిర్మాణం కోసం చంద్రబాబు ఇలా అడ్డదారులు తొక్కారని వైసీపీ ఆరోపించింది. తాజాగా మంగళగిరిలో కట్టిన టీడీపీ ఆఫీసు అక్రమమంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టులో సోమవారం పిల్ దాఖలు చేశారు. చంద్రబాబు ఉండే ఇల్లు అక్రమమేనని, ఇప్పుడు ఆయన కట్టుకున్న పార్టీ కార్యాలయం కూడా అక్రమంగానే నిర్మించారని దీని కోసం మొదట 3.65 సెంట్ల భూమిని టీడీపీ ప్రభుత్వమే కేటాయించుకుందని తెలిపారు. అది కాకుండా పార్టీ కార్యాలయం కోసం ఉమా మహేశ్వర్‌రెడ్డి అనే రైతు భూమిని కబ్జా చేశారని, దీనిపై ఆ రైతు కోర్టును ఆశ్రయిస్తే కోర్టు స్టే కూడా ఇచ్చిందని, అయితే కోర్టు ఉత్తర్వులను కూడా చంద్రబాబు పాటించకుండా పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని ఆళ్ల తన పిటీషన్‌లో పేర్కొన్నారు .ఈ పిటీషన్‌ను స్వీకరించిన హైకోర్ట్..రాష్ట్ర ప్రభుత్వానికి, గుంటూరు జిల్లా కలెక్టర్‌కు, టీడీపీకి హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. కాగా ఇటీవలే టీడీపీ మంగళగిరిలో నిర్మించిన పార్టీ ఆఫీసును ప్రారంభించింది. అయితే టీడీపీ ఆఫీస్ అక్రమమని రుజువు చేసే పక్కా ఆధారాలను ఆళ్ల హైకోర్టుకు సమర్పించినట్లు సమాచారం. దీంతో హైకోర్టు విచారణలో ఇవే కీలకంగా మారనున్నాయి. ఈ పిల్‌పై ఫిబ్రవరి నుంచి హైకోర్ట్ విచారణ జరపనుంది. ఈ నేపథ‌్యంలో ఈ కేసులో హైకోర్టు ఎలా తీర్పు ఇస్తుందో అన్న ఉత్కంఠ టీడీపీలో మొదలైంది. మొత్తంగా మంగళగిరిలో నిర్మించిన టీడీపీ ఆఫీస్ అక్రమ కట్టడమేని అని పక్కా తెలుస్తోంది. మరి చంద్రబాబు, లోకేష్‌లు పార్టీ ఆఫీస్ విషయంలో హైకోర్టు జారీ చేసిన నోటీసులకు ఎలా స్పందిస్తారో చూడాలి.
